హాలీవుడ్ రేంజులో రెచ్చిపోయింది..

551
Lavanya Tripathi liplock with Sharwanand
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఒకే రకమైన రోల్స్‌కి ఫిక్స్‌ అయితే బోరింగ్‌ గా ఉంటుంది. ఒక్కోసారి ఆఫర్లను సైతం దగ్గ్రరికి కూడా రానివ్వవు. అంతేమరి..ఎప్పుడూ ఒకే రకమైన రోల్స్‌లో కనిపిస్తే ఆడియెన్స్‌ కూడా బోర్‌ ఫీలౌతారు. అందుకే హీరోగా దుమ్ముదులిపేసిన వాళ్ళు కూడా నెగిటివ్‌ రోల్స్‌ కి ఓకే చెప్పేస్తున్నారు.

ఇక హీరోయిన్ల విషయానికొస్తే..కొత్త రోల్స్‌ అంటూ..ఐటెంసాంగ్స్‌ అంటూ తెగ చిందులేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే..? ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడంకోసమే అంటూ సెలవిస్తారు. ఇక వీరు ఇలాఉంటే..ఇప్పుడొచ్చే సినిమాల్లో ఆడియెన్స్‌కి కావాల్సిన మాసాలా ఏంటో కనుక్కొని మరీ స్పైసీ సీన్స్‌ పెట్టేస్తున్నారు మూవీ డైరెక్టర్స్‌.
Lavanya Tripathi liplock with Sharwanand
దాంతో ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడినికి నేను రెడీ అంటూ..కొంతమంది భామలు ఓపెన్‌ గానే చెప్పేస్తున్నారు. ఇక ఇంకోందరైతే..ఎప్పుడూ ఒకే డ్సెస్సా…? ఇకనుంచైనా కాస్త మోడ్రన్‌గా కనిపిస్తా అంటున్నారు. ఈ కోవకే చెందుతుంది లావణ్యత్రిపాఠి. మొన్నటికి మొన్న చీర పిప్పేస్తానంటూ..బోల్ట్‌ గానే చెప్పేసింది. అంటే ఆ మాటకర్థం.. మోడ్రన్‌ డ్రెస్‌ లో కనిపించాలని.

అయితే ఇప్పుడు ఈ అమ్మడి కోరికలు నిజమౌతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్స్‌పోజింగ్ చెయ్యకుండా టాలీవుడ్ లో డీసెంట్ హీరోయిన్‌గా ఉన్న లావ‌ణ్య త్రిపాఠి, ఇప్పుడా హ‌ద్దుల‌న్నింటినీ చెరిపేసిందట‌. తాజాగా ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమాగా తెర‌కెక్కిన రాధ చిత్రంలో ఈ అమ్మడు తెగ రెచ్చిపోయిందట. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో శ‌ర్వానంద్ తో చేసిన రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా ఉంటాయ‌ని ప‌బ్లిక్ గా చెప్పేసింది లావణ్య.
 Lavanya Tripathi liplock with Sharwanand
అయితే..అవి ఎలాంటి సీన్స్ అని మాత్రం చెప్పకుండా త‌ప్పించుకుంది. లావ‌ణ్య ఆ విషయాన్ని దాచేసినా చిత్ర యూనిట్ చెప్పిన మాటేంటంటే .. శ‌ర్వాతో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రొమాన్స్ చేసిందని, పెద‌వి ముద్దుల్లో అయితే హాలీవుడ్ బ్యూటీస్ రేంజులో రెచ్చిపోయిందని చెప్తున్నారు. దాంతో ఈ మ్యాటరే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇక లావణ్య శ‌ర్వా గురించి మాట్లాడుతూ..’ఆన్‌సెట్స్ లో శ‌ర్వా పెద్ద‌గా ఎవ‌రితో మాట్లాడడు. కానీ త‌న‌తో పనిచేస్తున్నంత సేపు చాలా హ్యాపీగా, కంఫర్టుబుల్‌ గా ఉంది’ అని లావణ్య‌ ఆకాశానికెత్తేసింది.

Lavanya Tripathi liplock with Sharwanand

అయితే ఈ అమ్మ‌డు ఇప్ప‌టివ‌ర‌కూ చాలా మంది యంగ్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. కానీ ఎవ‌రి గురించి ఏ సంద‌ర్భంలోనూ ఇలా మాట్లాడలేదు. ఏదేమైనా రాధ త్వ‌ర‌లోనే రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే..ఆ తర్వాతే లావణ్య ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలుస్తుంది. అప్పటి వరకూ కాస్త వెయిట్‌ చెయ్యాల్సిందే.

- Advertisement -