బాహుబలి దర్శకుడెవరు..?

191
baahubali, who directed that?
- Advertisement -

బాహుబలి-2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’నిలిచింది. అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్‌ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందంటే బాహుబలి స్టామినా ఏంటో అందరికీ తెలిసిపోయింది. బాహుబలి కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ రాజమౌళికి ప్రతిఫలం దక్కింది. ఇది ఇలా ఉండగా ఓ తెలుగు హీరోకు మాత్రం బాహుబలి దర్శకుడెవరో తెలియదట. ఈ విషయం హీరోయిన్ నికీషా పటేల్ వెల్లడించింది.

nikisha patel tweet

నికీషా పటేల్ తన సోషల్ మీడియా ఖాతాలో దీనిపై వెల్లడిస్తూ పోస్టులు పెట్టింది. అందులో ఇటీవ‌ల ఓ తెలుగు హీరోను ‘బాహుబ‌లి-2: ద కన్ క్లూజన్’ సినిమా చూశావా?’ అని అడిగాను. దానికి ఆ నటుడు తిరిగి ‘ఆ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు?’ అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడని తెలిపింది. దానికి తాను చాలా ‘ఆశ్చర్యపోయానని, అతనిని చూస్తుంటే అసహ్యమేసిందని, దీనికి సిగ్గుపడాలని’ తెలిపింది. అతని పేరును ఉచ్చరించాలంటే కూడా చిరాగ్గా ఉందని నికీషా పటేల్ తెలిపింది. ఇంతకీ రాజమౌళి అంటే నచ్చని తెలుగు హీరో ఎవరా.. అని సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి.

- Advertisement -