లవకుశ నాగరాజు కన్నుమూత..

129
lavakusha

తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే స్వర్ణోత్సవ చిత్ర కావ్యం లవకుశ. ఈ సినిమాలో లవుడు గా నటించిన ప్రఖ్యాత చలనచిత్ర నటులు నాగరాజు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

1963వ సంవత్సరంలో విడుదలయిన చిత్రం లవకుశ. నందమూరి తారక రామారావు నటించిన ‘లవకుశ’ చిత్రంలో నాగరాజు లవుడుగా నటించారు. ఈ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. నాగరాజు అసలు పేరు నాగేందర్‌రావు. ఆయన సుమారు 300 చిత్రాల్లో నటించారు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏవీ సుబ్బారావు కుమారుడే నాగరాజు. భక్తరామదాసు చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.