శ్రీదేవి…చివరి ఫోటోలు

245
Last pictures of Sridevi
- Advertisement -

తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తీవ్రమైన గుండెపోటుతో దుబాయ్‌లో కన్నుమూశారు.శ్రీదేవి మృతి పట్ల యావత్ భారతదేశ చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

శ్రీదేవి చివరగా యూఏఈలో జరిగిన బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ సోనమ్ కపూర్, కరణ్ జోహార్, అనీల్ కపూర్ తదితరులు హాజరయ్యారు. చిన్న కూతురు ఖుషితో కలిసి ఆమె సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే బోనీ కపూర్‌తో కలిసి నూతన వధూవరులతోనూ ఫోటో దిగారు. శ్రీదేవి ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుక ముగించుకొని తిరిగి వద్దామనుకునే సమయానికి అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Last pictures of Sridevi 1 Last pictures of Sridevi 2 Last pictures of Sridevi 3 Last pictures of Sridevi 4

Last pictures of Sridevi 5

Last pictures of Sridevi 6 Last pictures of Sridevi

- Advertisement -