అవార్డులు..ప్రశంసలు శ్రీదేవి సొంతం

197
- Advertisement -

బాలనటిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీదేవి…కెరీర్‌లో ఏనాడూ వెనక్కి తిరిగిచూసుకోలేదు. పాత్ర ఏదైనా,సీనియర్ నటుడైనా బెదరలేదు. తన పాత్రకి వందశాతం న్యాయం చేసిన శ్రీదేవి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. ఆమె నటనకు యావత్‌ భారతమే ఫిదా అయిపోయింది. బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు.

Sridevi Kapoor get Nandi Award from Kshana kshanam

ఇక అతిలోక సుందరి నటనకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు జాలువారాయి. తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న శ్రీదేవి ఎంతోమంది హీరోయిన్లకు రోల్ మాడల్‌గా నిలిచింది. భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్‌ జ్యూరీ లభించాయి.

తెలుగులో ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం మూవీకి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్‌ సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ 100 ఇయర్స్‌’గా శ్రీదేవి ఎంపికయ్యారు.

Sridevi Kapoor get Nandi Award from Kshana kshanam

- Advertisement -