నేటితో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్ గడువు…

204
lrs scheme
- Advertisement -

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ గడువు నేటితో ముగియనుంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోని అక్ర‌మ‌, అన‌ధికార లేఅవుట్లు, పాట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను త‌ప్ప‌నిస‌రిచేస్తూ ఆగ‌స్టు 31న రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీంతో రాష్ట్ర‌వాప్తంగా ఎల్ఆర్ఎస్‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది.

శుక్రవారం వరకు 24,14,337 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు రాగా నిన్న ఒక్క‌రోజే 70 వేల‌కుపైగా మంది ఎల్ఆర్ఎస్‌కోసం అప్ల‌య్ చేసుకున్నారు. వాస్తవానికి ఈనెల 15తోనే దరఖాస్తు గడువు ముగియగా మరో 15 రోజులు పొడగించింది ప్రభుత్వం.

గ్రామపంచాయ‌తీల్లో 10,17,293 ద‌ర‌ఖాస్తులు రాగా, మున్సిపాలిటీల్లో 10,02,325, కార్పొరేష‌న్ల‌లో 3,94,719 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. చివరి రోజు లక్షకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరణ రుసుం పెంపు, ప్రస్తుత మార్కెట్‌ విలువనే పరిగణనలోకి తీసుకుంటుండటం, ప్రతి అనధికార ప్లాటు దాదాపుగా ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉండటంతో అటు ప్రజలకు సేఫ్‌ ఇటు ప్రభుత్వానికి ఆదాయం బారీగా వచ్చింది.

- Advertisement -