అమెరికాలో 90 లక్షలు దాటిన కరోనా కేసులు…

84
america

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటాయి.

గత 24 గంటల్లో 94 వేలకుపైగా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,16,297కు చేరుకోగా 2,35,159 మ‌ర‌ణించారు. ఇప్పటివరకు కరోనా నుండి 60,24,512 మంది కోలుకోగా ప్రస్తుతం 30,56,626 పాజిటివ్ కేసులున్నాయి.

ఇక ఫ్రాన్స్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో 13,31,984 పాజిటివ్ కేసులు నమోదుకాగా 36,565 మంది మ‌ర‌ణించారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 4,58,98,590 దాటాయి.