బిగ్ బాస్ 55 రోజుల జర్నీ…ఇంటి సభ్యుల కంటతడి!

87
monal

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 55 రోజులు పూర్తి చేసుకుంది. 55వ ఎపిసోడ్‌లో భాగంగా ఈ 55 రోజుల జర్నీని చూపిస్తూ సభ్యులను ఎమోషనల్‌కు గురిచేశారు బిగ్ బాస్.

ప్రేమ‌లు, అల‌క‌లు, గొడ‌వ‌లు, చిలిపి ప‌నులు, బాధ‌లు అన్నింటి స‌మ్మేళ‌న‌మైన‌ మ‌ధుర జ్ఞాప‌కాలను గుర్తు చేశాడు. వారి జ‌ర్నీని చూసుకుని కంటెస్టెంట్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. పాత జ్ఞాప‌కాలు గుర్తు రావ‌డంతో అభిజిత్, మోనాల్, అఖిల్‌ కలిసిపోయారు. అయితే అరియానా మాత్రం ఒంట‌రిన‌య్యాన‌నిపిస్తోంద‌ని ఏడుస్తుంటే మేమంతా ఉన్నామంటూ అవినాష్ ఓదార్చాడు.

ఇక ఇప్పటివరకు ఏడు వారాల్లో ఏడుగురు సభ్యులు ఇంటి నుండి బయటకు వెళ్లారు. తొలి వారంలో సూర్య కిరణ్,రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి,7వ వారంలో దివి ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్యం కారణాలతో గంగవ్వ ఇంటి నుండి బయటకు వెళ్లగా నోయల్ మాత్రం తిరిగి హౌస్‌లోకి రానున్నాడు.