- Advertisement -
శ్రీకాకుళం జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో పేదలకు స్మార్డ్ సిటీల నిర్మాణాలకు ‘స్థలసేకరణ పనులు వేగవంతం చేశారు రెవిన్యూ అధికారులు. పలాసలో తక్కువ ధరతో, ఆధునిక హంగులతో ప్రజలకు ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. అయితే వీటి నిర్మాణాలకు అవసరమైన భూములను బొడ్డపాడు సమీపంలో సమీకరణ చేసేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. టెక్కలి ఆర్టీవో పర్యవేక్షణలో పలాస తాహాషిల్దార్‌తో పాటు పలాస రెవిన్యూ అధికారులు బొడ్డపాడు చేరుకున్నారు. ముందుగా ప్రభుత్వ భూమి, డి పట్టా భూములు సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ముందుగా రైతుల ఆక్రమణలో ఉన్న డి పట్టా భూములు వారి వద్ద నుండి అంగీకారం తీసుకున్నారు. అవసరం అయితే జీ రాయితీ భూములు కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -