ఆరు నెలల తర్వాతే ఓటీటీ : లాల్‌సింగ్‌ చద్దా!

58
lalsingh
- Advertisement -

సినీ లోకంలో సౌత్‌ సినిమాల హవా కొనసాగుతూ, పాన్‌ ఇండియా సినిమాలుగా ఎదుగుతున్న వేళ హిందీలోని మాత్రం సినిమాలు భారీ హిట్‌ ను అందుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో హిందీలో లాల్‌సింగ్‌ చద్దా మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్‌ 11న థియేటర్లలో విడుదలవుతోంది. సినీ అభిమానులు మాత్రం అమీర్‌ చిత్రంపై ఆశలు మరియు ఆందోళనలు రెండింటినీ అమాంతం పెంచేసుకున్నారు.

ఈ సినిమా గురించిన చర్చ విడుదల వరకు కొనసాగాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అమీర్ బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది.

సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌ను తాకుతుంది. అయితే, లాల్ సింగ్ చద్దాను ఓటీటీలో చూడటానికి, ప్రేక్షకులు కనీసం ఆరు నెలల పాటు వేచి ఉండాలి. లాల్ సింగ్ చద్దా థియేట్రికల్‌గా విడుదలైన ఆరు నెలల తర్వాత మాత్రమే ఓటీటీకి వస్తుందని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -