OTT:పొగాకు ఉత్పత్తులపై కేంద్రం కీలక ఆదేశాలు

40
- Advertisement -

మే 31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భరంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓటీటీ లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం నోటీఫికేషన్ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు పబ్లిషర్‌పై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది.

పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించిన 2004నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఓటీటీ మాధ్యమాల్లో ప్రదర్శించే వెబ్‌సిరీస్‌లు సినిమాలు ఇతర వినోద కార్యక్రమాల్లో పొగాకు వినియోగానికి సంబంధించిన దృశ్యాలుంటే ఒకపై హెచ్చరికలు జారీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. పొగాకు వినియోగం క్యాన్సర్‌ కారకం పొగాకు వినియోగం ప్రాణాంతకం అని సినిమా థియేటర్లు టీవీల్లో ప్రదర్శిస్తున్న మాదిరిగానే ఓటీటీలోనూ ప్రదర్శించాలని కనీసం 30సెకన్ల పాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటనలు ఉండాలని పేర్కొన్నారు.

Also Read: MAY30: గోవా స్టేట్‌హూడ్ డే

పొగాకు ఉత్పత్తులను వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లైయిమర్‌లను ప్రదర్శించాలని పేర్కొంది. ఈ సందేశం కూడా నిబంధనలకు అనుగుణంగా తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగులో ఉండాలని తెలిపింది. అలాగే ఈ హెచ్చరికల ప్రకటనలు ఓటీటీ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని స్పష్టం చేసింది. ఈనిబంధనలు ఉల్లంఘిస్తే ఆరోగ్య శాఖ ప్రసార శాఖ ఐటీ శాఖ ప్రతినిధులు దీనిపై చర్యలు తీసుకుంటారని సదరు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Also Read: MP Santhosh:బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం

- Advertisement -