ఘనంగా లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు..

259
- Advertisement -

జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల సంద‌ర్భంగా లాల్‌దర్వాజలోని అమ్మ‌వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. అమ్మ‌వారి గుడి వ‌ద్ద భక్తులకు అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. పాత‌బ‌స్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

భ‌క్తులు క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని పోలీసులు సూచ‌న‌లు చేస్తున్నారు. పాత‌బ‌స్తీ ప్రాంతంలో బోనాల పండుగ కోలాహ‌లం నెల‌కొంది. బోనాల సంద‌ర్భంగా ఆ ప్రాంతంలో మొత్తం 8 వేల మందితో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లాల్‌ద‌ర్వాజ‌కు తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ విచ్చేశారు. రేపు రంగం త‌ర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుంద‌ని మంత్రి త‌ల‌సాని చెప్పారు.

- Advertisement -