సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల..

128
- Advertisement -

ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని,బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్దిగా పండుతున్నాయని తెలిపారు.

- Advertisement -