వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఎప్రిల్ 29న ఒక్క ఏపీలో తప్ప మిగతా అన్నీ రాష్ట్రాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈమూవీని ఏపీలో రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత రాకేష్ రెడ్డి, దర్శకుడు వర్మ. సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే విడుదలకు వారు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
ఇటివలే వర్మ విజయవాడలో ప్రెస్ మీట్ పెడతాను అంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు వర్మ. 40ఏండ్ల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు నేను ప్రెస్ మీట్ పెడుతానంటే ఎందుకు భయపడుతున్నాడో తనకు అర్ధం కావడం లేదన్నారు.
అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మే23వరకు సినిమాను విడుదల చేయకూడదన్న ఈసీకి విరుద్దంగా..ఈసినిమాను రేపు విడుదల చేస్తామని వర్మ చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.