ఘనంగా ముగిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ వేడుకలు..

98
mp santhosh
- Advertisement -

ఆరు రోజుల పాటూ అంగరంగ వైభవంగా సాగిన నిజామాబాద్ జిల్లా సీహెచ్ కొండూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ వేడుకలు ముగిశాయి. చివరిరోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచే ఎమ్మెల్సీ కవిత దంపతులు ప్రత్యేక హోమం, విగ్రహ ప్రతిష్టాపన, మహా సంప్రోక్షణ నిర్వహించారు.

స్వామివారి కల్యాణం, మంగళహారతి వేడుకలు కన్నుల పండుగగా ముగిశాయి. ఆరు రోజుల పాటూ వేడుకలు వైభవంగా జరిగేందుకు సహకరించిన వేదపండితులకు, సీహెచ్ కొండూరు గ్రామస్తులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ముగింపు పూజా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా సహా వందలాది భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -