పెళ్లిచేసుకోనంటున్న స్టార్ హీరోయిన్…

318
lakshmimenon
- Advertisement -

తమిళ హీరోయిన్ లక్ష్మీమీనన్ వివాహ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై తనకు నమ్మకం లేదని, వివాహం చేసుకుంటేనే బంధాలు బలంగా ఉంటాయని తాను భావించడం లేదని పేర్కొన్నారు. తాను మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పింది. అలా అని తన జీవితంలో ఎవరూ ఉండరని అనుకొవద్దని, తన జీవితంలో ఓ వ్యక్తి ఉంటారని చెప్పింది. ఆ వ్యక్తికి ప్రేమ, నమ్మకం ఉండాలని అన్నారు.

lakshmimenon-Vishal

ఆ వ్యక్తితో కలిసి ఉండడం వలన సహజీవనం అని చెప్పలేనని, దాన్ని మీకు ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదని చెప్పారు. ఇక హీరో విశాల్ తో లక్ష్మీమీనన్ ప్రమాయణం కొనసాగిస్తుందని కోలీవుడ్ లో చాలా కాలంగా టాక్ వినిపించింది. ఈ మధ్యనే లక్ష్మీమీనన్ కు విశాల్ కూడా బ్రేకప్ చెప్పేశాడని తమిళ మీడియాలో కథనాలు కూడా వినిపించాయి.

ఇక 15 ఏళ్ల వయసులోనే ఈ అమ్మడు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, నటిగా మంచి గుర్తింపు పొందారు. తమిళం, మళయాల భాషలలో పలు సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. విశాల్ హోరోగా తెరకెక్కిన పల్నాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ప్రస్తుతం తమిళ్, మళయాలం చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

.

- Advertisement -