దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌: సీఎం కేసీఆర్

361
kcr
- Advertisement -

తలసరి ఆదాయంలో తెలంగాన దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన సీఎం..ప్రజల ఆదరణతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు.

కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడు మాట్లాడిన ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంచిని మంచి అనే పద్దతి కాంగ్రెస్ సభ్యులకు లేదన్నారు. రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తుందన్నారు.

ఒక గ్రామంలో భగీరథ నీళ్లు రాకుంటే మొత్తం పథకమే దండగ అన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని ఎంతకాలం మోసాం చేస్తామో అందరం ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమన్నారు. ఏపీ నుంచి విడిపోతే లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పామని అంతకుమించి ఇచ్చాం..భవిష్యత్తులో ఇచ్చితీరుతామన్నారు.

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని కాగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం పింఛన్‌ వంద శాతం పెంచి రూ.2016 చేశామని…. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నామో చెప్పాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నాం అని… ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.9లక్షల కోట్లకు పైగా ఉందన్నారు.

- Advertisement -