దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ( ఈనెల 26వ తేదీ) ఉదయం 6 గంటల వరకు మొత్తంగా ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్.
ఇక ఇవాళ రాత్రి నుంచి ఢిల్లీ లో లాక్డౌన్ ప్రకటించడంతో మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు. వైన్స్ షాపు ముందు భారీగా క్యూ కట్టారు. మాస్కులు, భౌతిక దూరం లేకుండానే క్యూ లైన్లలో నిలుచోగా మద్యం కొనడానికి మహిళలు కూడా భారీగా తరలివచ్చారు.
రోజురోజుకూ భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేజ్రీవాల్. కరోనాతో ఇప్పటికే అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినా.. లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు..