లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్‌లోని లచ్చమమ్మో వీడియో సాంగ్

90
- Advertisement -

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ”లచ్చమమ్మో’ వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది.

గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇవి కూడా చదవండి..

నేను మోసం చేసింది వారినే: పూరి

కాంతార ఓటీటీ షాక్‌!

రాజగోపాల్ బాగోతం బట్టబయలు..

- Advertisement -