లాభాల్లోకి దసరా.. పూర్తి లెక్కలివే

65
- Advertisement -

నాని దసరా మొత్తానికి లాభాల్లోకి అడుగు పెట్టింది. కేవలం 5 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి.. క్లీన్ హిట్ గా నిలిచింది. నాని సినీ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా దసరా నిలవడం విశేషం. పైగా మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంతోనే నాని సూపర్ హిట్ కొట్టడం మరో రికార్డు. ఇంతకీ, ఓవరాల్ గా దసరా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది ?, ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో నాని ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగింది ?, ఇప్పటివరకు నిర్మాతకు లాభాలు ఎన్ని కోట్లు వచ్చాయో ? చూద్దాం రండి.

ముందుగా ఈ దసరా చిత్రానికి 5 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం : 19.55 కోట్లు
సీడెడ్ : 4.81 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.61 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.88 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.10 కోట్లు
గుంటూరు : 2.13 కోట్లు
కృష్ణ : 1.58 కోట్లు
నెల్లూరు : 78 లక్షలు

ఏపీ + తెలంగాణలో దసరా చిత్రానికి 5 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 35.44 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 59.8 కోట్లు వచ్చాయి.

కర్ణాటక + మిగతా రాష్ట్రాల్లో: 4.02 కోట్లు
ఇతర భాషలు: 1.60 కోట్లు
ఓవర్సీస్: 8.10 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘దసరా’ చిత్రానికి 5 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 50.48 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 5 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 92 కోట్లను కొల్లగొట్టింది

ఈ సినిమాకి ఓవరాల్ గా 48 కోట్ల బిజినెస్ జరిగింది. 49 కోట్లను బ్రేక్ ఈవెంట్ టార్గెట్. అయితే, 5 రోజుల్లో 1.48 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా దసరా నిలబడింది. పైగా ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్స్ అన్నీ లాభాల కిందే వస్తాయి.

ఇవి కూడా చదవండి…

నిరాశ నిస్పృహలో క్రేజీ బ్యూటీ ?

ఆ హాస్యనటి మనసులో మాటలు

Dasara:నైజాంలో దసరా సంబరం.. కానీ,

- Advertisement -