నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్రం: ఎల్ రమణ

159
L Ramana
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం నేతన్నల నడ్డి విరుస్తోందన్నారు టీఆర్ఎస్ నేత ఎల్ రమణ. హుజురాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన రమణ… సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తుంటే…. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పథకాలన్నింటినీ ఎత్తివేస్తున్నదని విమర్శించారు.

అంబానీ, అదానీలకు వేల కోట్లు దోచిపెడుతూ దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ముడి సరికులపై సబ్సిడీ, థ్రిఫ్ట్‌ఫండ్‌, నేతన్నకు బీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పారు

ఈటల రాజేందర్‌ తన స్వప్రయోజనాల కోసం రాజీనామా చేశారని …ఈటల ఉద్దేశాన్ని ప్రజలు గమనించారని, ఈ నెల 30న తగిన తీర్పునిస్తారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నల్ల చట్టాలు తెచ్చిందన్న ఈటల ఆ పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. పద్మశాలీల ఆత్మగౌరవ భవనానికి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో రెండున్నర ఎకరాల స్థలం కేటాయించారని చెప్పారు.

- Advertisement -