టీటీడీపీ అధ్యక్ష పదవికి రమణ రాజీనామా..

144
ramana
- Advertisement -

టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఎల్ రమణ. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెలంగాణలో ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని…గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు సహకరించిన చంద్రబాబుకు రమణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రమణ చేరికతో తెలంగాణలో టీడీపీ చాప్టర్ పూర్తిగా ముగిసినట్లే. గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన రమణ…సామాజిక తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. కొవిడ్‌ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కితాబిచ్చారు.

- Advertisement -