టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌..

103
KXIP vs MI

అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-13లో ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లు తలపడుతున్నాయి. గత మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని భావిస్తున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఎం అశ్విన్‌ స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్‌ చెప్పాడు.

మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు జట్లు 3 మ్యాచ్‌ల్లో తలపడగా రెండింట్లో ఓటమిపాలై ఒక్కదాంట్లో విజయం సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:లోకేష్ రాహుల్ (w / c), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, నాయర్, జేమ్స్ నీషామ్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్

ముంబై ఇండియన్స్‌:రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (wc), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా