రెండో విడత ‘సెరో’ సర్వే ఫలితాలు..

209
icmr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరిపిన సెరో సర్వే ఫలితాలను విడుదలైయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 శాతం మందికి కరోనా వైరస్ సోకి వుంటుందని అంఛానా వేస్తోంది ఐసీఎంఆర్. రాష్ట్రంలో జరిపిన రెండో విడత సెరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సంయుక్తంగా గురువారం విడుదల చేశాయి. రాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత యాంటీ బాడీస్ టెస్టుల ఫలితాలను కూడా విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల్లో యాంటీ బాడీస్ గణనీయంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది.

రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 4 కోట్లు కాగా.. అందులో 12 శాతం అంటే సుమారు 48 లక్షల మందికి ఇదివరకే కరోనా వచ్చి వెళ్ళి వుంటుందని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సర్వేలో తేలడం విశేషం. కానీ అధికారిక గణాంకాలలో కరోనా సోకిన వారి సంఖ్య కేవలం 1 లక్షా 93 వేలుగా (అక్టోబర్ 1 ఉదయం నాటికి) వుంది. ఆగస్టు 26, 27 తేదీలలో సెరో సర్వే నిర్వహించగా.. మే నెలతో పోల్చితే.. ఆగస్టులో జరిగిన సర్వే లో పాజిటివ్ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.

-జనగాం, నల్గొండ, కామారెడ్డి లలో 30 గ్రామాలలో 13 వందల 9 మందికి యాంటీ బాడీ టెస్ట్ లు నిర్వహించారు.
-జనగాంలో 454 మంది శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 83 మందికి పాజిటివ్ (18.2%) అని తేలింది.
-ఇక మే నెలలో జనగాంలో 0.5% మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి.
-నల్గొండలో 422 మందికి టెస్ట్ చెయ్యగా 47 మందికి పాజిటివ్ (11.1%) వచ్చాయి.
-నల్గొండలో మే నెలలో 0.25% మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
-కామారెడ్డిలో 433 మంది శాంపిల్స్ కు గాను.. 30 మందికి పాజిటివ్ (6.9%) వచ్చింది.
-మే నెలలో కామారెడ్డిలో 0.25% పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

- Advertisement -