ఈ సీజన్ ఐపీఎల్ కోల్ కత్తా భారీ స్కోర్ నమోదు చేసింది. శనివారం జరిగిన హోల్కర్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్ మెన్ ప్రారంభం నుంచే వీర బాదుడు బాదారు. బౌండరీలతో, సిక్స్ లతో క్రికెట్ స్టేడియంని హోరెత్తించారు. ఆరంభం నుంచి బ్యాట్స్ మెన్ చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ సీజన్ లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.
సునీల్ నరైన్ 36 బంతుల్లో 9 పోర్లు, 4 సిక్సులు బాది 75 పరుగులు చేశాడు. దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సులు 50 పరుగులు చేశాడు. రస్పెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులుతో హోరెత్తించాడు. వీళ్ల విధ్వంస కర బ్యాటింగ్ తో పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో నరైన్ మంచి పునాది వేయగా పంజాబ్ బౌలర్లు పుంజుకుంటున్న సమయంలో ఆఖర్లో దినేశ్ కార్తీక్ తక్కువ బంతులల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి భారీ స్కోర్ దిశగా నడిపించాడు.