సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ

5
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. మూసీ మీద నీ స్టాండ్ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు..నిజానికి మన పార్టీ శ్రేయోభిలాషులు కొంతమంది ప్రభుత్వం మూసి ప్రక్షాళనను మొదటిదశలోనూ, సుందరీకరణను రెండవ దశలోనూ చేపడితే బాగుంటుందని మీకు సూచించవలసినదిగా నన్ను కోరినా.. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తిని గమనించి, మీ ఆలోచన, విజన్, సమర్ధత పై నమ్మకంతో.. ఆ విషయం మీదృష్టికి తేలేదు అన్నారు.

నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫాం హౌస్‌లకు సంబంధిత అధికారులను వెంటనే పంపించి.. వారు చట్ట ప్రకారం అక్కడ ఎఫ్‌టి‌ఎల్, బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేస్తే, ఆ పరిధిలో ఏదైనా కట్టడం మా ఫార్మ్ హౌస్ లో ఉంటే, 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా, మా స్వంత ఖర్చులతో ఆ కట్టడాన్నికూల్చి, ఆ వ్యర్ధాలను తొలగించి, శుభ్రం కూడా చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని నా కోరిక అని తెలిపారు.

Also Read:3వ అంతస్తు నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్

- Advertisement -