బూడిదతో మహాత్ముడి చిత్రం..ఇండియా బుక్‌లో చోటు

154
gandhi
- Advertisement -

కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన ఓ యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. బుడిదతో మహాత్మాగాంధీ చిత్రాన్ని వేయడంతో అత్యుత్తమ కళగా గుర్తించిన ఇండియా బుక్ ఆప్‌ రికార్డ్స్‌ ఆ యువకుడికి పురస్కారాన్ని అందించింది.

ఆదోని పట్టణం నాయాయణ గుంతకు చెందిన శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.కళాఖండాలను సృష్టించడం ప్రవృత్తిగా పెట్టుకున్న న్న శ్రీకాంత్…. కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదలో తన చేతి మునివేళ్లను అద్ది తెల్ల కాగితంపై బాపూ (మహాత్మా గాంధీ) బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు.

కాగితం కాల్చి బూడిద చేయడం నుంచి బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థకు పంపారు. రికార్డును పరిశీలించిన ఆ సంస్థ ప్యానల్‌ కమిటీ 2021– 22లో అత్యుత్తమ ఆర్ట్‌గా గుర్తించింది. కరోనా నిబంధనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్‌ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్‌లో పంపి సత్కరించింది.

- Advertisement -