- Advertisement -
ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. మొదటి, రెండో రౌండ్‌లోనూ ఆయన వెనుకబడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి ముందజలో కొనసాగుతున్నారు. ఇక్కడ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి అనూహ్య ఫలితం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ చంద్రమౌళి 67 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రచారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, చంద్రబాబుపై చంద్రమౌళి గెలిస్తే మంత్రి పదవిని ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రస్తుత ట్రెండ్స్ తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా కనిపించక పోయినా, లెక్కించబోయే రౌండ్లలో ఆధిక్యం ఖాయమని, తమదే విజయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
- Advertisement -