కుంబ్లేకి చెక్ పెట్టేందుకేనా?

248
Kumble to face the axe?
Kumble to face the axe?
- Advertisement -

కోచ్‌ అనిల్ కుంబ్లే పదవికాం ముగుస్తుండడంతో టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామంటూ ప్రకటన ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో… హెడ్ కోచ్ కోసం ప్రకటన జారీ చేసినట్టు తెలిపింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య సలహాదారు కమిటీ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందని చెప్పింది. నిబంధనల ప్రస్తుతం హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే మాత్రం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. ఆయనకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే లోపు టీమిండియాకు కొత్త కోచ్ నియామకం జరగని తరుణంలో కుంబ్లేనే ఆ బాధ్యతల్లో కొనసాగుతాడని బీసీసీఐ అధికారికంగా తెలిపింది.

ఇటీవలే ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ పాలనా కమిటీ(సీఓఏ)కి కెప్టెన్ కోహ్లీతో అనిల్ కుంబ్లేలు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్ కుంబ్లేకి చెక్ పెట్టేందుకే బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనిల్‌ కుంబ్లే, కోహ్లీ వేరువేరుగా ఆటగాళ్ల ఆర్ధిక పరిస్ధితులను సీఓఏకు వివరించారు. పుజార లాంటి టెస్టు బ్యాట్స్‌మన్‌ ఐపీఎల్‌ ఆడలేదిని, కేవలం రంజీలు ఆడే పవన్‌ నేగి ఐపీఎల్‌ లో 45 రోజుల్లో రూ.8.5 కోట్లు సంపాందించారని తెలిపారు. ఇక కుంబ్లే నివేదిక లో టీం ఇండియా సపోర్ట్‌ స్టాఫ్‌ ఫీజులు కూడా పెంచాలని పేర్కొన్నారు.

-anil-kumble-virat-kohli

కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లలో విజయం సాధించింది. టెస్టుల్లో తిరిగి నంబర్‌ వన్‌గా అవతరించింది. ప్రపంచంలో ఏ కోచ్‌ అయినా ఇలాంటి గణంకాలు నమోదు చేస్తే వారినే కొనసాగిస్తారు. కానీ ప్రస్తుతం బీసీసీఐ మాత్రం కొత్త వారిని ఆహ్వానిస్తోంది. టీమిండియా బ్యాటింగ్‌ కోచ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ ఆర్‌. శ్రీధర్‌లను చాంపియన ట్రోఫీ వరకూ కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి కాంట్రాక్టులు మార్చిలోనే ముగిశాయి.

- Advertisement -