పెళ్ళి కాకుండానే తల్లి అవుతా..!

321
Shruthi Hassan wants a BABY without MARRIAGE
- Advertisement -

బోల్డ్‌ గా మాట్లాడాలంటే..కాస్త మొహమాటపడుతుంటారు చాలామంది. కానీ ఈ మద్య బోల్డ్‌ గా మాట్లాడడమే ట్రెండ్‌ అయిపోయినట్టుంది. కొన్ని కొన్ని విషయాలను చాలా బోల్డ్‌గానే చెప్పేస్తున్నారు హీరోయిన్స్‌. అందులో శృతిహాసన్ కూడా ముందుందనే చెప్పాలి.

ఈ అమ్మడు ఈమధ్య బోల్డ్‌ స్టేట్‌మెంట్లు బాగానే ఇస్తోంది. ఇటాలియన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖేల్‌ కోర్సేల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతిహాసన్‌ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా అతడిని వెంట పెట్టుకునే వెళుతోంది.
 Shruthi Hassan wants a BABY without MARRIAGE
ఆమెకి ఇండియాలో షూటింగ్స్‌ వున్నపుడు అతను విజిట్‌ వీసాపై ఇండియాకి వచ్చేస్తున్నాడు. ఇకపోతే తన రిలేషన్‌ గురించి శృతి ఓపెన్‌గా మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. తనకో బాయ్‌ఫ్రెండ్‌ వున్నాడని మీడియా ముందు శృతి అంగీకరించడం లేదు. అతడిని అల్లుడిగా కమల్‌హాసన్‌ కూడా యాక్సెప్ట్‌ చేసేసాడని మీడియా రాస్తోంది. కానీ శృతిహాసన్‌ మాత్రం గతంలో ఒక మ్యుజీషియన్‌ని ప్రేమించానని, తర్వాత మళ్లీ ఎవరి ప్రేమలోను పడలేదని చెప్పింది.
Shruthi Hassan wants a BABY without MARRIAGE
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, ఆ టైమ్‌ వచ్చినపుడు చేసుకుంటానని చెప్పిన శృతిహాసన్‌ ఆ వెంటనే ఒకవేళ సరయిన వ్యక్తి తారసపడితే పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడానికి సిద్ధమని, మీడియా, జనం తనగురించి ఏమనుకుంటారనే భయం లేదని పేర్కొంది.

విశేషం ఏమిటంటే గత మూడు, నాలుగేళ్లుగా శృతి హాసన్‌ ఈ స్టేట్‌మెంట్‌ ఇస్తోంది. ఓ సందర్భంలో కమల్‌ కూడా అది తన వ్యక్తిగత విషయమని అన్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ లేడంటూ, పెళ్లికి ఇంకా సమయం వుందంటూ పిల్లల్ని కనాల్సి వస్తే కంటానని శృతి అనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

- Advertisement -