కుమారీ ఆంటీ..ఎన్నికల ప్రచారం!

27
- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్‌ నైట్‌లో స్టార్‌గా మారిపోయారు కుమారీ ఆంటీ. హైదరాబాద్‌లో ఆక్రమణల సందర్భంగా ఆమె హోటల్‌ను అధికారులు తొలగిస్తే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోడంతో ఒక్కసారిగా ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేస్తున్నారు. హాట్ సీట్‌గా మారిన గుడివాడలో కూటమి అభ్యర్థి తరపున కుమారి ఆంటీ ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నానికీ, టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకూ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

రాముతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కుమారి ఆంటీ. ఈసారి రాముకు ఓటేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా నానిపై విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని తెలిపింది. అందరూ కలిసి గుడివాడను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చింది. అందుకే టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకు అందరూ మద్దతిచ్చు గెలిపించాలని కోరింది. ఉపాధి లేకపోవడం వల్లే తాను గుడివాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది.

Also Read:Rahul:ఆర్టీసీ బస్సులో రాహుల్‌తో సీఎం రేవంత్‌

- Advertisement -