బిగ్ బాస్ 3లోకి కుమారి 21F

426
Hebba Patel
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ షో త్వరలోనే ప్రారంభంకానుంది. తెలుగులో బిగ్ బాస్ 2 సీజన్లు విజయవంతంగా పూర్తీ చేసుకుని మూడవ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటికే ఈషోకు సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేశారు.బిగ్ బాస్ 3కి అక్కినేని నాగార్జున హోస్ గా వ్యవహిరించనున్నారు. జులై 21నుంచి ఈ షో ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ షోలో పార్టిసిపెంట్ చేయబోయే సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇందులో ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, కోరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సింగర్ హేమచంద్ర, యాంకర్ ఉదయ భాను ఇలా పలువురి పేర్లు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది.

తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్ కూడా బిగ్ బాస్ 3లోకి వెళ్లనుందని తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే బిగ్ బాస్ 3 ప్రారంభం అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -