బీజేపీ వాకౌట్..గెలిచిన కుమారస్వామి

235
Kumaraswamy
- Advertisement -

కర్ణాటక రాజకీయ రంగస్థలానికి తెరపడింది. విధానసౌధలో జరిగిన బలపరీక్షలో గట్టెక్కారు సీఎం కుమారస్వామి.బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు దీంతో కుమార స్వామి ఎన్నిక లాంఛనమైంది.

ఈ సందర్భంగా మమాట్లాడిన కుమారస్వామి ప్రజలు ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని తాము కొనసాగిస్తామని చెప్పారు.హంగ్ అసెంబ్లీ రాష్ట్రానికి కొత్త కాదని 2004లో కూడా హంగ్ ఏర్పడిందని గుర్తుచేశారు.తనకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. పక్క రాష్ట్రం గోవాలోనూ సంకీర్ణ ప్రభుత్వం అధికారం నడుపుతోందన్నారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని…పరిస్థితుల ప్రభావం వల్లే ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అంతకముందు హైడ్రామాగా జరిగిన స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలిచింది.చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యే తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవడంతో ఆపార్టీ నేత రమేష్‌ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ,కొత్తగా ఎన్నికైన స్పీకర్ రమేశ్ కుమార్‌కు యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ పోస్టుపై తమకు గౌరవం ఉన్నందునే చివరి నిమిషంలో తమ అభ్యర్థి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నామని తెలిపారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పారు. సభలో తమ్ముడు కూమరస్వామి తనను గౌరవిస్తూ మాట్లాడినందుకు యడ్యూరప్ప కృతజ్ఞతలు చెప్పారు.

స్పీకర్ రమేష్ కుమార్ సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అంతకు ముందే ఎస్‌ఎం కృష్ణ సీఎంగా ఉన్న సమయంలో స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉంది. శ్రీనివాసపురం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ స్పీకర్ గా ఎన్నిక అయ్యారు.

- Advertisement -