మ‌రింత ఆల‌స్యంగా రానున్న ‘నా నువ్వే’

283
kalyan ram na nuvve movie
- Advertisement -

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా నానువ్వే. త‌మిళ‌ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరెకెక్కింది. రోమాంటిక్ ఎంట‌టైన‌ర్ గా ఈసినిమాను నిర్మించారు. చాలా రోజుల తర్వాత క‌ళ్యాణ్ రామ్ పుల్ లెన్త్ ల‌వ్ స్టోరీలో క‌నిపించ‌నున్నాడు. ఇక ఇసినిమా నేడు ప్రేక్ష‌కుల మందుకు రావాల్సి ఉండ‌గా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈసినిమా విడుద‌ల ను పోస్ట్ పోన్ చేశారు చిత్ర బృందం.

kalyan ram na nuvve movie

చాలా రోజుల క్రిత‌మే షూటింగ్ పూర్తిచేసుకున్న కొన్ని టెక్నిక‌ల్ కార‌ణాల వ‌ల్ల సినిమా విడుద‌లను ఆపివేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల పూర్తి కాక‌పోవ‌డం వ‌ల్లే సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నామ‌న్నారు. దింతో ఈమూవీని మ‌రో వారం రోజుల త‌ర్వాత విడుద‌ల చేస్తామని చెప్పారు. జూన్ 1 తేదిన సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈసినిమా విడుద‌ల మ‌రింత ఆల‌స్యంగా రానున్న‌ట్లు చెబుతున్నారు.

kalyan ram na nuvve movie

అయితే చిత్ర బృందం మాత్రం ఇంకా అధికారిక డేట్ ను మాత్రం రిలీజ్ చేయ‌లేదు. తాజాగా వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం జూన్ 8న లేదా జూన్ 14 న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. సినిమాలో కొన్ని సీన్లకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ పూర్తి కానందున సినిమా విడుద‌ల‌కు ఆల‌స్యం అవుతుంద‌న్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -