బీజేపీలో జేడీఎస్‌ విలీనం!

21
- Advertisement -

కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జేడీఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు రాగా దీనిపై స్పందించారు మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి. జేడీఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం….వంద మంది సిద్ధరామయ్యలు తిరగబడినా మా పార్టీని ఏం చేయలేరని తేల్చిచెప్పారు.

ప్రధాని మోడీజాతీయ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో దేవెగౌడ సైతం విమర్శించారని.. అయినా మోడీ ప్రధాని అయ్యాక దేవెగౌడ సైతం ఆయనను కలిశారన్నారు. కాంగ్రెస్‌ను ఓడించే సత్తా మా పార్టీకి ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ పేరులో సెక్యులర్ అనే పదాన్ని తొలగించారని… తమిళనాడులో డీఎంకే… కాంగ్రెస్, బీజేపీ రెండింటితో చేతులు కలిపిందని మండిపడ్డారు.

Also Read:KTR:వినోద్‌తోనే కరీంనగర్ అభివృద్ధి..

- Advertisement -