కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని తల్లి అవంతి, బార్య చేతన్‌కుల్ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే పాకిస్థాన్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్‌ను వీరు కలిసిన విషయం తెలిసిందే.
వీరు భారత్ తిరిగొచ్చిన అనంతరం ఇవాళ సుష్మాస్వరాజ్‌ను కలిశారు. వారి విజ్ఞప్తి మేరకు తాను చేయగలిగింది తాను చేస్తానని సుష్మా వారికి మాటిచ్చినట్టు తెలుస్తోంది.
ఇంతకుముందు పలుమార్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరిపిన సుష్మా స్వరాజ్ వారికి కుల్ భూషణ్ ని కలిసే అవకాశం కల్పించారు. అలాగే, మరోసారి కూడా కుల్‌భూషణ్‌ని కలిసే అవకాశాన్ని కల్పిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వీరికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క, చర్చలు సఫలమైతే కుల్‌భూషణ్‌ని విడిపించే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.