గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన ప్రశాంతి

29
gic

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జి హెచ్ ఎం సి కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు పొగడ , అర్జున మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ప్రశాంతి మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురిని 1) deputy commissioner, khairatabad 2) deputy commissioner chanda nagar 3) Deputy commissioner gajularamaram మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.