టీఆర్ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి బీజేపీ నాయకులు..

44
puvvada

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరావు ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ…గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. మరోసారి హైదరాబాద్‌ గులాబీ ఎంజెడా ఎగుర వేయనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.