గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్…

37
trs

గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్‌ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 25 మందితో మూడో జాబితాను విడుదల చేసింది టీఆర్ఎస్. తొలిజాబితాలో 105 మంది, రెండో జాబితాలో 20 మందితో కూడిన జాబితా విడుదల చేసింది టీఆర్‌ఎస్‌.ఇవాళ నామినేషన్ కు చివరి రోజు కావడంతో బారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 22వ తేదీ నుండి గ్రేటర్‌లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు కేటీఆర్. కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షోలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు టీఆర్ఎస్‌ నేతలు.. ఇక, ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.