కూకట్‌పల్లి దోపిడీ కేసు చేధించిన పోలీసులు..

26
kukatpally

హైదరాబాద్ కూకట్‌పల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన ఏటీఎం దోపిడీ కేసును ఛేదించారు సైబరాబాద్‌ పోలీసులు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

రెండు రోజులక్రితం కూకట్‌పల్లి పటేల్‌కుంటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో సిబ్బంది డబ్బులు నింపుతున్నారు. అదేసమయంలో ఆల్విన్‌ కాలనీ వైపు నుంచి పల్సర్‌ బైక్‌పై వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఇద్దరు ఏటీఎం సిబ్బందితోపాటు సెక్యూరిటీ గార్డుపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ.5 లక్షలు దోచుకెళ్లారు.

కాలప్పుల్లో గాయపడిన ఏటీఎం సిబ్బంది అలీ బేగ్ చనిపోగా శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.