దేశాభివృద్ధిలో కార్మికులది కీలకపాత్ర: సీఎం కేసీఆర్

29
kcr cm

దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం…… శ్రమ జీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యమైందన్నారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

మేడే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆదర్శవంతమైన కార్మిక, కర్షక, విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టించడంతో పాటు.. ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.