ఉత్కంఠరేపుతున్న ‘ఫ్యామిలీ డ్రామా’ ట్రైలర్..

193
Family Drama

కలర్‌ ఫోటోతో హిట్‌ అందుకున్న నటుడు సుహాస్‌ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతున్నాడు. సుహాస్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. మెహెర్‌ తేజ్‌ దర్శకుడు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్‌.

కథానాయకుడు బ్లేడఃతో చాలా సింపుల్ గా పీకలు కోసే సీరియల్ కిల్లర్ గా కనిపిస్తున్నాడు. అలా వరుస హత్యలు చేసే ఆయన బారిన ఒక ఫ్యామిలీ ఎలా పడింది? ఆలస్యంగా అసలు విషయాన్ని తెలుసుకున్న వాళ్లు ఆయన బారి నుంచి తప్పుంచుకోగలిగారా? అసలు కథానాయకుడు అలా ఎందుకు మారాడు? అనేదే అసలు కథ. ట్రైలర్ చూస్తుంటేనే ఇది ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసే సినిమాగా అనిపిస్తోంది.

ఛష్మా ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యమైన పాత్రలలో పూజా కిరణ్,శృతి మెహర్, సంజయ్, తేజ కనిపించనున్నారు. దాదాపు ఆర్టిస్టులంతా కొత్తవారే. అజయ్ – సంజయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Family Drama Movie Trailer 4K | Suhas | Teja Kasarapu | Pooja Kiran | Meher Tej | Telugu FilmNagar