ప్రపంచ విజేతను అభినందించిన కేటీఆర్‌..

375
KTR
- Advertisement -

లార్డ్స్ మైదానంలో జరిగిన వరల్డ్ కప్‌ను అత్యంత ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య నెగ్గిన ఇంగ్లాండ్ జట్టుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి అద్భుతమైన రాత్రి మరొకటి లేదంటూ కేటీఆర్ కితాబిచ్చారు.ఇంగ్లాండ్ మీ అదృష్టం మీ 12వ ఆటగాడిలాగా పొంగిపొర్లుతోందంటూ ఆయన తెలిపారు. ఇక కివీస్ జట్టును చూస్తుంటే గుండె నీరయిపోతోందంటూ సానుభూతి వ్యక్తం చేస్తు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

final

ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన‌ ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఈ మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఆశ్చర్యంగా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్‌లో ఇంగ్లండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు.

- Advertisement -