కొత్త మంత్రులకు కేటీఆర్ విషెస్..

267
ktr trs
- Advertisement -

తెలంగాణ కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్,రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకులు హాజరయ్యారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తన సహచర ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రులందరూ పని చేస్తారని విశ్వసిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర మంత్రులుగా ఈటల రాజేందర్‌, జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రమాణస్వీకారం చేయగా వీరిలో ఆరుగురు కొత్తవారే.

- Advertisement -