కేటీఆర్..ముఖ్యనాయకుడు

214
KTR will be Mukhya Nayakudu
- Advertisement -

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వ‌ర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మే డే సందర్భంగా మంత్రులు కేటీఆర్,నాయిని పార్టీ జెండా ఎగురవేశారు. కార్మిక సోదరులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రానున్న రోజుల్లో రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యనాయకుడు కాబోతున్నాడని తెలిపారు.

కార్మికుల సంక్షేమానికి పాటు పడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు నాయిని. కాంగ్రెస్ హయాంలో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి కేసీఆర్ పెద్దన్నలా మారాడాని తెలిపారు. ప్రజల గుండెల్లో నిండుగా ఉన్న కేసీఆర్‌ని ఎవరు ఏమి చేయలేరన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. కేసీఆర్ ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారని…కాంగ్రెస్ నాయకులకు కూడా కంటి పరీక్షలు చేయించాలన్నారు. అప్పుడే కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందన్నారు.

KTR will be Mukhya Nayakudu

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు రోడ్డున పడే పరిస్ధితి వచ్చిందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం నిత్యం ధర్నాలు జరిగేవని…పవర్ హాలీడేలు ప్రకటించిన రోజులు ఉన్నాయని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చినట్లు వెల్లడించారు. అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నమన్నారు. పేదల ఆత్మగౌరవం పెంపొందించేలా డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం చేపట్టామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం అని పునరుద్ఘాటించారు.

- Advertisement -