KTR:కాంగ్రెస్ విధానాలతో రైతులు ఆగమాగం

11
- Advertisement -

ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగిన తరవాత బోడి మల్లన్న అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను, మరియు సాగునీళ్లందక ఎండిన పంటలను కేటీఆర్‌ పరిశీలించారు. పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా అంటూ మాయమాటలు చెప్పి, ఇప్పుడు సీఎం అయ్యాక రైతుల దిక్కు కూడా చూడకుండా హైదరాబాద్ – ఢిల్లీ చక్కర్లు కొడ్తున్న మోసకారి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రైతులు కష్టాల్లో ఉంటే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతున్నాడన్నారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ. 25,000 ల నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారని …రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతుబంధు కోసం కెసిఆర్ రూ. 7 వేల కోట్లు పెట్టిపోతే… ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా… కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -