పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదిక..

304
ktr
- Advertisement -

పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కే తారకరామారావు విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి ప్రగతిభవన్‌లో ఈరోజు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌, జాతీయ జియస్ డిపి సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదయిందన్నారు. తలసరి (ఫర్ క్యాపిట) ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు 1,34,432 రూపాయలతో పోల్చినప్పుడు తెలంగాణ పర్ క్యాపిట ఆదాయం 2,28,216 రూపాయలుగా నమోదైందని మంత్రి అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.6 1 శాతం నుంచి 11.5 8 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ నివేధికలో పలు అంశాల వారీగా పరిశ్రమల శాఖ సాధించిన ప్రగతిని వివరించారు.

టియస్ ఐపాస్:

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక ts-ipass విధానం తెలంగాణకు అద్భుతమైన ఫలితాలను అందించిందని, ముఖ్యంగా ఈఓడిబి ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటి దాకా ద్వారా వచ్చిన పెట్టుబడుల మొత్తం సంఖ్య 1,96,404 కోట్లరూపాయలుగా నమోదైందని అన్నారు. ఇప్పటిదాకా అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో సుమారు 45, 848 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఇక భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్ సార్ ప్షన్ (absorption) విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ నగరం జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా మరోసారి ప్రథమ ర్యాంకు సాధించినన్నారు.బెస్ట్ పర్ఫామింగ్ స్టేట్ గా నీతిఅయోగ్ ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలో తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్నారు. సుమారు కరోనా రిలీఫ్ ఫండ్ కోసం సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులను లేదా ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారన్నారు.

వివిధ రంగాల వారీగా తెలంగాణ పరిశ్రమల శాఖ సాధించిన మైలురాళ్ళు:

ఫార్మా మరియు లైఫ్ సైన్స్ రంగం..

• ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా హైదరాబాద్ ఫార్మా మరియు లైఫ్ సైన్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకొని జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తన వాటాను 35 శాతంగా కోనసాగించింది.
• ప్రస్తుతం సుమారు ఎనిమిది వందల ఫార్మా, బయోటెక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. తద్వారా వీటి యొక్క ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ 50 బిలియన్ డాలర్లుగా ఉన్నది. రానున్న దశాబ్దకాలంలో దీని విలువను 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతోపాటు నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
• నోవార్టిస్ తన డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్లో ప్రారంభించింది.
• ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ పరిశ్రమకు smt కంపెనీ పునాది వేసింది. 250 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్ లో ఈ పరిశ్రమ రానున్నది. దీని ద్వారా 1500 మందికి నేరుగా ఉపాధి లభించనుంది.
• సింజిన్ కంపెనీ జీనోమ్ వ్యాలీ లో 170 కోట్ల రూపాయలతో తన పరిశ్రమను స్థాపించింది.
• 180,000 స్క్వేర్ ఫీట్ లతో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో యంయన్ పార్క్ బిల్డింగ్ కోసం జినోమ్ వ్యాలీలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
• హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈసారి శాండజ్, సింజిన్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా ఇలాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి.
• మెడికల్ డివైస్ పార్క్ లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి.
• హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (నిమ్జ్) గుర్తింపునిచ్చింది.

ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్..

• కేంద్ర సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించి తమ రాష్ట్రం గా అవార్డు అందుకుంది.
• హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే మూడవ గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుంది.
• నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సుమారు ఐదు డిఫెన్స్ ప్రాజెక్టు హైదరాబాద్ తీసుకురావడం ద్వారా ఆరు వందల మందికి ఉపాధి కల్పించి ఉన్నది.
• రెండు లక్షల 40 వేల చదరపు అడుగుల తో 350 కోట్ల రూపాయలతో జిఎంఆర్ బిజినెస్ పార్క్ ని శంషాబాద్ లో ఏర్పాటు చేస్తున్నది.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగం..

• ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు ఏడు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభమయ్యాయి.
• మరో మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయి.

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్..

• సిరిసిల్లలో 60 ఎకరాల తో అప్పారెల్ పార్క్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది.
• దీంతో పాటు మరో వీవింగ్ పార్క్ సిరిసిల్లలో అభివృద్ధి చేయడం జరుగుతున్నది. పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. 88 ఎకరాల్లో 50 ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణం చేయడం ద్వారా 4416 పవర్లూమ్ లు, 60 వార్పిన్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
• కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సుమారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలతో 300 ఎకరాల్లో తమ కంపెనీని పెట్టేందుకు యంగ్ వన్ కంపెనీ తుది దశ ఒప్పందాన్ని ప్రభుత్వంతో కుదుర్చుకున్నది. తద్వారా 12 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
• చందన్వెళ్లి లో వెల్ స్పన్ (welspun) గ్రూపు 1150 కోట్ల రూపాయలతో కేవలం 14 నెలల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. తద్వారా వేయి మందికి ఉపాధి లభించింది
• గణేశా ఈకోస్పియర్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో 327 కోట్ల రూపాయలతో 30 ఎకరాల్లో 1000 మంది ఉపాధి ఇచ్చేందుకు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది
• నేతన్నకు చేయూత ద్వారా 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది, తద్వారా 20,298 మంది కి నేతన్నలకు లబ్ది కలిగింది.
• చేనేత మిత్ర ద్వార 36 వేల 233 మంది చేనేత కార్మికులకు లబ్ధి కలిగింది.

రిటైల్ రంగం..

• 20 వేల చదరపు ఫీట్లతో గచ్చిబౌలిలో తెలంగాణ లోనే అతి పెద్ద అమెజాన్ లార్జెస్ట్ డెలివరీ సెంటర్ స్టార్ట్ చేసింది.
• అమెజాన్ ఇప్పటికీ 3.2 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల స్టోరేజీ కలిగిన మూడు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లు ఉన్నాయి.
• తెలంగాణలో వాల్ మార్ట్ తన 5వ స్టోర్ ను వరంగల్లో ప్రారంభించింది.
• సుమారు 13 కోట్ల రూపాయలతో 7 ఎకరాల్లో కంటైనర్ ఫ్రీట్ స్టేషన్ ప్రారంభమైంది.

ఇతర అంశాలు..

• తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో సుమారు 18 ఎంఎస్ఎంఈ లను రివైవ్ చేయడం జరిగింది.
• తెలంగాణ న్యూజెర్సీలో మధ్యల సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ 2019 సెప్టెంబర్ లో కుదుర్చుకోవడం చేయడం జరిగింది. తద్వారా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్స్, బయోటెక్, మెడికల్, మీడియా వంటి వివిధ రంగాల్లో భాగస్వామ్యానికి ఒప్పందం కుదిరింది.
• కేంద్ర ప్రభుత్వం వరంగల్ మరియు హైదరాబాద్ నగరానికి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కేటాయించింది.
• అమెరికా కంపెనీ కట్టేరా(kattera) ఆఫ్ సైట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని షాబాద్ లో ఏర్పాటు చేస్తున్నది. సుమారు ఏడు వందల కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ కంపెనీ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది.
• వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు ఇండియా ఎకనామిక్ సమ్మిట్, బయో ఏషియా, వింగ్స్ ఇండియా 20 20, ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్, వరల్డ్ డిజైన్ అసెంబ్లీ, హైదరాబాద్ డిజైన్ వీక్, జాతీయ చేనేత దినోత్సవం వంటి అనేక కీలకమైన జాతీయ అంతర్జాతీయ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో పాల్గొని తెలంగాణకు సంబంధించిన పెట్టుబడులు అనుకూల వాతావరణాన్ని వివరించి, తెలంగాణకు పరిశ్రమలను ఆకర్షించడం జరిగింది.

- Advertisement -