- Advertisement -
ప్రజా జీవితంలోకి వచ్చి ఈ సెప్టెంబర్‌తో 16 ఏండ్లు పూర్తయ్యాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కేటీఆర్.. గ్లోబల్ లీడర్‌గా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో 8 ఏండ్లు, ప్రభుత్వంలో 8 సంవత్సరాలకు పైగా జీవితం గడిచిపోయిందన్నారు. ఈ 16 ఏండ్ల కాలంలోని అనేక స్మృతులు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నారు కేటీఆర్. అంతే కాకుండా.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ.. అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ ప్రజలు గొప్ప మద్దతు ఇచ్చారని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Advertisement -