వర్షాలను రాజకీయం చేయొద్దు: కేటీఆర్

28
- Advertisement -

వర్షాలను రాజకీచం చేయొద్దన్నారు మంత్రి కేటీఆర్. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో వరద పరిస్థితిని  కేటీఆర్‌ పరిశీలించారు. విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రతిపక్షాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని.. వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు.

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన క్రమంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Also Read:మెగాస్టార్‌కి సర్జరీ నిజమే!

వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read:విద్యాసంస్థలకు సెలవు..సీఎం కేసీఆర్ నిర్ణయం

- Advertisement -