#VT14:వరుణ్ తేజ్‌..’మట్కా’

47
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తన14వ చిత్రాన్ని చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. #VT14 వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రం కానుంది. ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి ని ఎంపిక చేశారు. మరో అప్‌డేట్ ఏమిటంటే నోరా ఫతేహి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది.

1960లో వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన నేపథ్యంగా సినిమా తెరకెక్కనుంది. 60ల నాటి పరిస్థితులు,అనుభూతిని తీసుకురావానికి యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ సినిమాకు మట్కా అనే మాస్ టైటిల్ ని ప్రకటించి ఓ పోస్టర్ ని కూడా రిలిజ్ చేశారు.

Also Read:పార్టీలు రెడీ.. నోటిఫికేషన్ ఎప్పుడు ?

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కథల ఎంపిక చాలా బాగుంటుంది. సినిమా సినిమాకు కథల్లో వ్యత్యాసం చూపిస్తాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కొత్త కథలతో సినిమాలు చేస్తున్నారు తేజ్. వైరా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఇవాళ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి.

Also Read:మెగాస్టార్‌కి సర్జరీ నిజమే!

- Advertisement -